Krishnam Raju: ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు

టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హఠాన్మరణంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయారు. అయితే కృష్ణంరాజు మృతిపై సినిమా రంగంతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా తమ సంతాపం తెలియజేశారు.

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు హఠాన్మరణంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయారు. అయితే కృష్ణంరాజు మృతిపై సినిమా రంగంతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా తమ సంతాపం తెలియజేశారు.

Krishnam Raju Death: కృష్ణంరాజు మృతి తీరనిలోటు.. సినీ ప్రముఖుల సంతాపం!

కాగా, కృష్ణంరాజు మృతిపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. ఇలాంటి గొప్ప నటుడిని కోల్పోవడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజుతో తనకు మంచి బంధం ఉందని, ఆయన్ని కోల్పోవడం ఓ మంచి స్నేహితుడిని కోల్పోవడమే అని కేసీఆర్ అన్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం..

ఇక ఈ లెజెండరీ యాక్టర్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఉంచి, రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు