Krishnam Raju : ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది

కృష్ణంరాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రభాస్ త్వరగా మ్యారేజ్‌ చేసుకుంటే వారి పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కానీ పెళ్లి విషయం.......

Prabhas

 

Prabhas :  ప్రభాస్, పూజాహెగ్డే జంటగా వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల మార్చ్ 11న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన విజయం అందుకుంది. రెండు రోజుల్లోనే దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది. సినిమా రిలీజ్ కి ముందు సినిమా కోసం చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కూడా ప్రమోషన్ చేయడం విశేషం. కృష్ణంరాజుకి ఇటీవలే సర్జరీ అయిందని, రెస్ట్ తీసుకుంటున్నారని, అందుకే ప్రమోషన్స్ లో పాల్గొనలేదని శ్యామల దేవి చెప్పారు.

తాజాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చారు. ‘రాధేశ్యామ్’ సినిమా విజయం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడారు.

Payal Rajput : తిరుమల వెంకన్న సన్నిధిలో పాయల్ సందడి

కృష్ణంరాజు మాట్లాడుతూ.. ”ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రభాస్ త్వరగా మ్యారేజ్‌ చేసుకుంటే వారి పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కానీ పెళ్లి విషయం పూర్తిగా వాడిష్టం. ఎవర్ని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ పిల్లలతో నేను ఆడుకుంటాను” అని తెలిపారు.

Krishnam Raju : ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్‌ చెప్పాడు

వీటితో పాటు ప్రభాస్ గురించి మరిన్ని విషయాలు తెలియచేసారు ఇంటర్వ్యూలో. ప్రభాస్‌ నటించిన సినిమాల్లో ‘వర్షం’ సినిమా తనకి చాలా ఇష్టమని, తను నటించిన ‘మనవూరి పాండవులు’ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని ఉందని, త్వరలో ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాడని తెలిపారు.