Krishnam Raju : ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్‌ చెప్పాడు

తాజాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చారు. 'రాధేశ్యామ్' సినిమా విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్.........

Krishnam Raju : ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్‌ చెప్పాడు

Prabhas

 

Prabhas :  ప్రభాస్, పూజాహెగ్డే జంటగా వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల మార్చ్ 11న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన విజయం అందుకుంది. రెండు రోజుల్లోనే దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది. మరోసారి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాతో కొత్త రికార్డులని సృష్టిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు సినిమా కోసం చిత్ర యూనిట్ తో పాటు ప్రభాస్ పెద్దమ్మ కూడా ప్రమోషన్ చేశారు. అప్పుడు కృష్ణంరాజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.

 

తాజాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చారు. ‘రాధేశ్యామ్’ సినిమా విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ”ఈ సినిమా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రభాస్ నేను కలిసి గతంలో కూడా కలిసి నటించాం. ఈ సినిమాలో మా అమ్మాయి ప్రసీద కూడా భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను ‘పరమహంస’ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రను చూస్తే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాగా అనిపిస్తుంది. ఆ పాత్రని చేయడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ‘పరమహంస’ పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. ప్రభాస్ అలా అనడం నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తాను” అని అన్నారు.

Paruchuri : పరుచూరి వెంకటేశ్వరరావు ఎలా మారిపోయారో చూడండి.. షాక్‌లో ప్రేక్షకులు..

ఇక ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ”ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా వల్ల కలిగిన ఆటంకాలతో ఈ సినిమా ఆలస్యం అయింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని నాతో ప్రభాస్‌ చెప్పాడు” అని కృష్ణంరాజు తెలిపారు. ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను అనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.