Paruchuri : పరుచూరి వెంకటేశ్వరరావు ఎలా మారిపోయారో చూడండి.. షాక్‌లో ప్రేక్షకులు..

పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు కూడా చాల సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. తన తమ్ముడితో కలిసి ఎన్నో సినిమాలకి కథలు, మాటలు అందించారు. అయితే ప్రస్తుతం..

Paruchuri : పరుచూరి వెంకటేశ్వరరావు ఎలా మారిపోయారో చూడండి.. షాక్‌లో ప్రేక్షకులు..

Paruchuri

Paruchuri :  తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ రచయితల్లో పరుచూరి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ కథలని అందించారు. ఈ పరుచూరి ద్వయం దాదాపు 300 సినిమాలకి పైగా కథలందించారు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందికి హిట్స్ ఇచ్చారు వీరు. అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు.

 

పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు కూడా చాల సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. తన తమ్ముడితో కలిసి ఎన్నో సినిమాలకి కథలు, మాటలు అందించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఆయనకి 77 సంవత్సరాలు. తాజాగా ఆయనకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఆ ఫోటో చూసి పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి అని బాధపడుతున్నారు ప్రేక్షకులు.

Varun Dhavan : సమంతకి బాడీగార్డ్‌గా బాలీవుడ్ హీరో..

పరుచూరి వెంకటేశ్వరరావు వయోభారంతో కృంగిపోతున్నారు. తాజాగా ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటో దిగి తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ ఫోటో షేర్ చేస్తూ..”నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. చాలా బక్కగా అయిపోయి, పూర్తిగా ముసలివాడిగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు లుక్‌ను చూసిన అభిమానులు బాధపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.