Rangamarthanda Trailer: ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమ అంతా నాటకం..!

దర్శకుడు క్రిష్ణవంశీ గతకొద్ది కాలంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. దీంతో ఆయన డైరెక్టర్‌గా సినిమాలు చేయడం ఇక ఆపేయాలని చాలా మంది విమర్శలు చేశారు. అయితే కృష్ణవంశీలోని క్రియేటివిటీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతూ వస్తున్న ఈ డైరెక్టర్, ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడినట్లుగా ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది.

Rangamarthanda Trailer: ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమ అంతా నాటకం..!

Krishnavamshi Creates Buzz With Rangamarthanda Trailer

Updated On : March 20, 2023 / 5:47 PM IST

Rangamarthanda Trailer: దర్శకుడు క్రిష్ణవంశీ గతకొద్ది కాలంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. దీంతో ఆయన డైరెక్టర్‌గా సినిమాలు చేయడం ఇక ఆపేయాలని చాలా మంది విమర్శలు చేశారు. అయితే కృష్ణవంశీలోని క్రియేటివిటీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతూ వస్తున్న ఈ డైరెక్టర్, ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడినట్లుగా ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది.

Rangamarthanda Teaser: రంగమార్తాండ టీజర్.. నువ్వొక చెత్త నటుడివి అంటూ క్యూరియాసిటీ పెంచేశారు!

రంగమార్తాండ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో ఆస్వాదించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తూ వచ్చాడు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన కృష్ణవంశీ, ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో రంగమార్తాండ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే పాజిటివిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. ఇక ఇటీవల ఈ చిత్ర టీజర్‌తో రంగమార్తాండ చిత్రంపై అంచనాలు అమాంతం పెంచేశాడు.

Rangamarthanda : ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్‌గా నింపేసి, తాను ఈ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాడో, ట్రైలర్‌లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర సినిమాకు ప్రాణం పోయనుండగా, మిగతా నటీనటులు కూడా ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ, బ్రహ్మానందం పాత్రలు ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఎప్పుడూ నవ్విస్తూ కనిపించే బ్రహ్మానందం, ఈ సినిమాలో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నాడు. ఆయన యాక్షన్‌తో పాటు చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను ఆలోచింపజేయనున్నాయి. ఈ ట్రైలర్‌లో బ్రహ్మానందం చెప్పే ‘‘ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమ అంతా నాటకం.. జగన్నాటకం..’’ డైలాగ్ అందుకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తానికి రంగమార్తాండ సినిమాతో కృష్ణవంశీ మరోసారి తన ట్యాలెంట్‌ను నిరూపించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుంది.