Krishnavataram Trailer: విజువల్ వండర్ గా ‘కృష్ణావతారం’.. అంచనాలు పెంచుతున్న ట్రైలర్
శ్రీకృష్ణ జన్మస్థలం మధురలో ఘనంగా విడుదలైన ‘కృష్ణావతారం పార్ట్ 1(Krishnavataram Trailer)' ట్రైలర్.
- V Santhosh Kumar
- Published on- April 15, 2026 / 08:14 PM IST
Krishnavataram Part 1 The Heart trailer released
Krishnavataram Trailer: శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో ‘కృష్ణావతారం’ చిత్ర ట్రైలర్(Krishnavataram Trailer) అత్యంత వైభవంగా విడుదలైంది. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సినిమాపై భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు హార్దిక్ గజ్జర్ ఈ పౌరాణిక చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఒక్కో ఫ్రేమ్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా నటిస్తుండగా, సుష్మిత భట్, సంస్కృతి జయాన, నివాషిని కృష్ణన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Krithi Shetty: స్టైలిష్ అండ్ హాట్.. కృతి శెట్టి బ్లాక్ బ్యూటీ అవతార్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు
క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్, అథశ్రీకథ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయనక బోస్ కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మొత్తం మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టులో మొదటి అధ్యాయం మే 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రకాష్ కపాడియా అందించిన కథనం, పురాణ గాథలను సరికొత్త రీతిలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాయి. ఈ సినిమా పౌరాణిక చిత్రాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.
