Ilayaraja: మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ శ్రియా సరన్, శర్మన్ జోషి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర యూనిట్.
Ilayaraja Live Concert : హైదరాబాద్ ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ 2023 గ్యాలరీ..
మ్యూజిక్ స్కూల్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరుకాగా, మ్యూజిక్ స్కూల్ మూవీ టీమ్ తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఇళయరాజా, శ్రియా, జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘పాపారావు గారు నాకు మంచి మిత్రుడు.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడే పనిచేశారు. పిల్లలకు సంబంధించి చాలా విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని ఆయన నాకు తెలిపారు. చాలామందిలో హిడెట్ ట్యాలెంట్ ఉంటుంది. నా కొడుకుకి 17 సంవత్సరాలు.. సడన్ గా ఒక రోజు వచ్చి సాంగ్ పాడాను అని చెప్పాడు.. మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలా పెంచాలి అలా పెంచాలి అని చెబుతాము.. ఇక్కడ మ్యూజిక్ యూనివర్సిటీ కట్టే అవకాశం మనకు కలిగింది.’’ అని తెలిపారు.
Ilayaraja: చిన్నారికి ఇళయరాజా సంగీతం క్లాసులు..
కాగా సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు.. చీటింగ్ ఉండదు.. మ్యూజిక్ ఉంటే లక్ష్మీ ఉంటుంది.. సరస్వతి ఉంటుంది.. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారవుతారు.. దేశం మొత్తం కూడా ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తారు.’’ అని అన్నారు. ఇక ఇళయరాజా అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పిల్లలకు సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.