ఎన్టీఆర్ ఫ్యాన్స్ Monthly Meet
కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటూ.. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు..

కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటూ.. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు..
నందమూరి తారక రామారావు.. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింప చేసిన మహోన్నత వ్యక్తి, సమ్మోహన శక్తి.. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. తారకరాముడి విగ్రహాలులేని వీధులు, ఆయన ఫోటో లేని తెలుగు వారి ఇళ్లూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు..
అయితే కూకట్‌పల్లిలో ఉన్న అన్నగారి అభిమానులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటూ.. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. వివరాల్లోకి వెళితే : కెపిహెచ్‌బి ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతం వారు, అన్నగారి అభిమానులూ అధిక సంఖ్యలో నివసిస్తుంటారు.. ఈ ప్రాంతానికి చెందిన వీరాభిమానులు అట్లూరి దీపక్, కర్నాటి కొండలరావు (కేకేఆర్), పవన్ మార్ని, విక్రమ్ సింహా తదితరులు మిగతా అభిమానులతో కలిసి ప్రతీ నెలా మొదటి ఆదివారం అన్నగారి విగ్రహం వద్ద సమావేశమవుతుంటారు.
ఆదివారం ఉదయం జేఎన్‌టీయూ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, పూల దండలు వేసి నివాళులు అర్పిస్తారు.. అన్నగారి పట్ల వారికున్న అభిమానం, గౌరవం, ఎన్టీఆర్ వారసుడు బాలయ్యపై వారు చూపించే ప్రేమ గురించి మాటల్లో చెప్పలేం.. ఎన్టీఆర్ పేరుతో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడాతమని చెబుతున్నారు ఫ్యాన్స్.