Monalisa
Monalisa : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన అందంతో బాగా వైరల్ అయిపోయింది మోనాలిసా. దెబ్బకి సినిమా ఛాన్సులు కూడా క్యూ కట్టాయి. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుండగా తెలుగులో కూడా ఇటీవలే హీరోయిన్ గా ఒక సినిమా ఓపెనింగ్ అయింది. నార్త్ లోనే కాక సౌత్ లో కూడా మోనాలిసా వైరల్ అయిపోతుంది.
ఓ పక్క హీరోయిన్ చాన్సులే కాకుండా ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది. తాజాగా కుంభమేళా మోనాలిసా హైదరాబాద్ లోని బేల్ ట్రీ హోటల్ కి సంబంధించిన అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ప్రారంభించింది. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కిచెన్ ప్రారంభించడమే కాదు కాఫీ కూడా పెట్టింది మోనాలిసా. అనంతరం మోనాలిసా బేల్ ట్రీ హోటల్ ఫుడ్ తిని చెఫ్ లను, హోటల్ ని మెచ్చుకుంది. ఇక మోనాలిసాని చూడటానికి జనాలు కూడా బాగానే వచ్చారు.
Also Read : Abhinav Manikanta : హీరోగా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్.. బొమ్మ హిట్ అంటూ..
ఈ హోటల్ అధినేత రాజారెడ్డి బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం. బిల్వ పత్రం అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే శివుడి కృపతో ఆ పేరు పెట్టాం అని తెలిపారు.