కుష్బూ కంటికి గాయం.. కుట్లు వేయడంతో కొద్దిరోజులపాటు విశ్రాంతి..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 01:40 PM IST
కుష్బూ కంటికి గాయం.. కుట్లు వేయడంతో కొద్దిరోజులపాటు విశ్రాంతి..

Updated On : August 19, 2020 / 2:19 PM IST

సీనియర్‌ హీరోయిన్‌ కుష్బూ కంటికి గాయమైంది. ఈ విషయం ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విట్టర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి’.. అంటూ కుష్బూ ట్వీట్‌‌ చేశారు. ట్వీట్ చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ సినీ పరిశ్రమవారు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.