×
Ad

Kushi Re-Release: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. న్యూ ఇయర్‌కి ఖుషి రీ రిలీజ్!

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ నెల 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అయిన జల్సా, తమ్ముడు సినిమాలను విడుదల చేశారు. అయితే పవర్ స్టార్ అల్ టైం ఫేవరేట్ మూవీ "ఖుషి"ని కూడా విడుదల చేస్తారు అనుకున్నా.. అన్ని సినిమాలు ఒకేసారి ఎందుకు అనే భావనతో విడుదల చేయలేదని నిర్మాత ఏఎం రత్నం వివరణ ఇచ్చారు.

  • Published On : September 25, 2022 / 08:36 AM IST

Kushi Re-Release Update

Kushi Re-Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను చిరంజీవి, పవన్, బాలయ్య.. ఇలా వరుసపెట్టి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ బెటర్ క్వాలిటీతో రీ రిలీజ్ లు అవుతూ ఫ్యాన్స్ కి కిక్కు ఇవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగాను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Pawan Kalyan: “వీరమల్లు”ను ముగించే పనిలో పవన్.. ఖుషీలో ఉన్న ఫాన్స్!

ఇక ఈ నెల 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అయిన జల్సా, తమ్ముడు సినిమాలను విడుదల చేశారు. అయితే పవర్ స్టార్ అల్ టైం ఫేవరేట్ మూవీ “ఖుషి”ని కూడా విడుదల చేస్తారు అనుకున్నా.. అన్ని సినిమాలు ఒకేసారి ఎందుకు అనే భావనతో విడుదల చేయలేదని నిర్మాత ఏఎం రత్నం వివరణ ఇచ్చారు.

అయితే సినిమాను మాత్రం రీ రిలీజ్ చేయడం పక్క అంటూ మాట ఇచ్చిన నిర్మాత, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. పవన్ అప్ కమింగ్ మూవీ ‘వీరమల్లు’కు కూడా ఏఎం రత్నం నిర్మాత కావడంతో.. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా రీ రిలీజ్ షోస్ ప్రసారం చేసే ఛాన్సులు ఉన్నాయి అంటున్నాయి సినీ వర్గాలు.