KVN producer Lohit is planning a film with Pawan Kalyanc
Pawan Kalyan: ఓజీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటిరోజు రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.320 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ (Pawan Kalyan)రాబట్టింది. ఇక ఓజీ హిట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇంతకాలానికి ఆయనకి హిట్ పడింది. ఇక ఓజీ తరువాత కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తా అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.
Samantha: నేనూ తప్పులు చేశాను.. దెబ్బలు తిన్నాను.. అవన్నీ అందరికీ తెలుసు..
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ దర్శకుడు సుజీత్ తో ఓజీ సినిమాకు ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. స్టేజిపైనే చెప్పేశారు కూడా. దీంతో రానున్న రోజులో పవన్ కళ్యాణ్ నుంచి మరికొన్ని సినిమాలు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారు పవన్ కళ్యాణ్. అదేంటంటే, ఇటీవల తమిళ నిర్మాణ సమస్త కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత లోహిత్ పవన్ కళ్యాణ్ ను కలిశారు.
కేవలం కలవడమే కాదు, తనతో సినిమా చేయడానికి డేట్స్ కావాలని కూడా అడిగాడట. దానికి పవన్ నుంచి కూడా పాజీటీవ్ రెస్పాన్స్ వచ్చిందట. ఈ న్యూస్ ప్రస్తుతం అటు తమిళ, ఇటు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ కాంబోలో వస్తున్న సినిమాకు దర్శకుడు ఎవరు అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది. కొంతమంది లోకేష్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం ఉందని అంటుంటే.. మరికొందరేమో హెచ్ వినోద్ తో సినిమా చేస్తాడు అని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు సినిమా చేసినా ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక వినోద్ సినిమా విషయానికి వస్తే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో దిట్ట. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి, పవన్-వినోద్ సినిమా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.