LAL SALAAM
Lal Salaam trailer: సౌతిండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ కీలకపాత్ర పోషించిన ‘లాల్ సలాం’ మూవీ ట్రైలర్ విడుదలైంది. విష్ణు విశాల్ – విక్రాంత్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథగా దీన్ని రూపొందిస్తున్నారు.
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. లైకా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. రజినీ ఈ సినిమాలో మోయిద్దీన్ భాయ్ అనే పాత్రలో కనపడుతున్నారు.
రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రజినీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. మోయిద్దీన్ భాయ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో రజినీకీ సోదరిగా జీవిత నటిస్తున్నారు.
ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చారు. రజినీకాంత్ పాత్రను ఈ సినిమా కోసం తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్లు విశేషంగా అలరించాయి.
Rajendra Prasad : ‘పెళ్లిపుస్తకం’ తరువాత నా కెరీర్‌లో ఆ స్థాయి చిత్రం ‘లగ్గం’..