Rajendra Prasad : ‘పెళ్లిపుస్తకం’ తరువాత నా కెరీర్‌లో ఆ స్థాయి చిత్రం ‘లగ్గం’..
'పెళ్లిపుస్తకం' తరువాత మళ్ళీ ఆ స్థాయి చిత్రంగా 'లగ్గం' తీసుకు వస్తున్నా అంటున్న రాజేంద్రప్రసాద్.

Rajendra Prasad launch his new movie laggam
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మెయిన్ లీడ్స్ చేస్తూ మంచి ఫార్మ్‌నే కొనసాగిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ని కూడా తీసుకు వస్తూ.. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ ని కూడా అలరిస్తుండ్రు వస్తున్నారు. తాజాగా ఈ సీనియర్ హీరో మరో సినిమాని అనౌన్స్ చేశారు. ఈ కొత్త సినిమా తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ ‘పెళ్లిపుస్తకం’ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.
ఇక ఈ చిత్రానికి కూడా పెళ్లి తతంగానికి సంబంధించిన పదం ‘లగ్గం’ అని పెట్టడం మరో ఆకర్షణ. నేడు ఈ మూవీ ప్రారంభం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా జరిగింది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రమేష్ చెప్పాల.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read : Lavanya Tripathi : మెగా ఫ్యాన్స్ తనని ‘వదిన’ అని పిలవడంపై.. లావణ్య రియాక్షన్ ఏంటో తెలుసా..?
ఇక ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “లగ్గం సినిమాలో నేను పోషించే పాత్ర ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేరు. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత మళ్ళీ అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. ఈ సినిమా పెళ్ళిపుస్తకం స్థాయి చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి. లగ్గం ఒక విందు భోజనం లాంటి సినిమా” అని పేర్కొన్నారు.
పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన ఈ మూవీ షూటింగ్ ని కూడా నేటి నుంచే మొదలు పెట్టేసారు. ఈ సినిమాలో తెలంగాణ పెళ్లి కల్చర్ ని ఎంటర్‌టైనింగ్ అండ్ ఎమోషనల్ గా చూపించబోతున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.