Singer Lata Mangeshkar : లతా మంగేష్కర్‌‌పై విష ప్రయోగం జరిగింది తెలుసా ?

మూడు రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ.. ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు.

Lata Mangeshkar Was Once Poisoned By Someone : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం తెలియచేస్తున్నారు. ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే..ఆమెపై విష ప్రయోగం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. 1962లో లతా మంగేష్కర్‌పై విష ప్రయోగం జరిగింది. ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. ఈ విషయాన్ని లతాజీకి అత్యంత సన్నిహితంగా మెలిగే.. ప్రముఖ రచయిత్రి పద్మా సచ్ దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. లతాజీ తనకు ఈ విషయం తెలియచేశారని, 1963లో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె బాధపడ్డారని, వాంతులు కూడా చేసుకుందన్నారు. కాళ్లు కదపలేక..శరీమంతా నొప్పితో బాధ పడినట్లు, డాక్టర్ ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని ఆమె చెప్పారని వెల్లడించారు.

Read More : Lata Mangeshkar: గాన కోకిలకు సంతాపం వ్యక్తం చేస్తూ చిరు ట్వీట్

మూడు రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ.. ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3 నెలలూ గేయ రచయిత సుల్తాన్ పురీ ఆమెను కోలుకోవడానికి సాయం చేశారంట. ప్రతీరోజూ సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతీ వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారని అంటుంటారు. 1963 జనవరి 27లో భారత్ – చైనా యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో పాట పాడారు లత. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. 1963లో మంగేష్కర్ ఎస్.డి.బర్మన్ సంగీత సారథ్యంలో మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్.డి.బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్ లో పాడారు లత. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్నా సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారెమె. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన రూతే రూతే పియా పాటకు కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత.

Read More : Lata Mangeshkar : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తిగీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. ఈ ఆల్బమ్లలో సాన్ వారే రంగ్ రాచీ, ఉద్ జా రే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు. 1999లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు లతా మంగేష్కర్‌. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు వచ్చేవి.

ట్రెండింగ్ వార్తలు