Lata Mangeshkar: గాన కోకిలకు సంతాపం వ్యక్తం చేస్తూ చిరు ట్వీట్

కొద్ది వారాలుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ఆదివారం ఆమె ఇక లేరనే వార్తను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.

Lata Mangeshkar: గాన కోకిలకు సంతాపం వ్యక్తం చేస్తూ చిరు ట్వీట్

Lata

Lata Mangeshkar: కొద్ది వారాలుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ఆదివారం ఆమె ఇక లేరనే వార్తను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. లతా మరణంపై సినీ లోకమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరు అంటే గుండె పగిలినట్టు ఉంది. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతుంది. ఆమె ఆత్మకు నా ప్రగాఢ సానుభూతి’ తెలియజేస్తున్నానంటూ పోస్టు చేశారు.

అంతకుముందే తాను కొవిడ్ నుంచి కోలుకున్నానంటూ చిరు అభిమానులకు గుడ్ న్యూస్ పంచుకున్నారు. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల కోలుకోగలిగానంటూ పేర్కొన్నారు.

Read Also : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్.. సెప్టెంబర్ 28కి ఆమె 91వ ఏట అడుగుపెడుతున్నారు. లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. తన కెరీర్‌లో 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. కానీ తెలుగులో ఆమె కేవలం మూడంటే మూడు పాటలే పాడటం మన దురదృష్టం అనే చెప్పాలి.