Lata Mangeshkar : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

లత 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది.

Lata Mangeshkar : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

Lata Songs

Lata Mangeshkar Life Biography : భారతీయ సినీ నేపథ్య సంగీతానికి చిరునామాగా మారిన గానకోకిల లతామంగేష్కర్ ఇకలేరు. భారతీయ సినిమా పాటను మహోన్నతశిఖరంపై ఉంచిన మధురగాయని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత నెల 11న కరోనాతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన లత తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు చేసిన పూజలు ఫలించలేదు. 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇక ఆమె జీవిత విషయాలకు వస్తే…

Read More : Lata Mangeshkar : లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఎన్నో తెలుసా ?

లత 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. ఐదో ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతి వారైనా పెద్దచదువులు చదవాలనుకొరుకునే వారు. లత తండ్రి దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా.. 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత ఆమెపై పడింది. దీంతో సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత 1943లో చిముక్లా సుసార్, 1944లో గజెభావు, 1946లో జీవన్ యాత్ర, 1948లో మందిర్‌ వంటి చిత్రాలలో నటించారు లతా. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.

Read More : Lata Ji : లతా మంగేష్కర్ తొలి పాట ఏమిటో తెలుసా ?

లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్‌లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా అవకాశం కల్పించారు. సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి బాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌ను చేశాయి‌.

Read More : Lata Mangeshkar : లతా మంగేష్కర్ మృతిపై మోదీ సంతాపం

లతా మంగేష్కర్‌ సినీ నిర్మాతగా 1953లో మరాఠీలో వాదల్, 1954లో కాంచన్ గంగా, హిందీలో ఝూంఝుర్, లేకిన్ చిత్రాలను నిర్మించారు. ఆమె సంగీత దర్శకురాలిగా రాంరాంపహునా, మొహిత్యాంచి మంజుల, మరాఠా టిటుకమేల్ వాలా, స్వాథూ మాన్ సే వంటి కొన్ని చిత్రాలకు పనిచేశారు. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ కీ సేవా మే లో పా లగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కు పరిచయమయ్యారు లత.