Lata Ji : లతా మంగేష్కర్ తొలి పాట ఇదే?

హిందీ సినీపాటల గాయని అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా పేరే. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లతా మంగేష్కర్‌ 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన

Lata Ji : లతా మంగేష్కర్ తొలి పాట ఇదే?

Lata Mangeshkar First Song : భారతరత్న లతా మంగేష్కర్ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. కొన్ని సినిమాల్లో ఆమె నటించారు కూడా. 1942లో లతా మంగేష్కర్‌ తొలిసారిగా మహల్ సినిమాలో ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆ పాట ఫేమస్‌గానే ఉంది. మొత్తం 980 సినిమాల్లో ఆమె పాటలు పాడారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు ఆమె. భారత ప్రభుత్వం ఆమెకు భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది.

Read More : Lata Mangeshkar : లతా మంగేష్కర్ మృతిపై మోదీ సంతాపం

హిందీ సినీపాటల గాయని అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా పేరే. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లతా మంగేష్కర్‌ 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించుకున్నారు. గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఈమె తెలుగులోని సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి పాటలు, ఆఖరి పోరాటం సినిమాలో తెల్లచీరకు పాటలు పాడారు. 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను “భారతీయ నేపథ్యగాయకుల రాణి”గా పేర్కొంది.
భారత ప్రభుత్వం నుంచి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్‌.

Read More : Lata Mangeshkar : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. Live Updates

ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే. 2001లో భారత ప్రభుత్వం ఆమెకు భారత రత్న అవార్డును ఇచ్చి సత్కరించింది. 1999లో పద్మవిభూషణ్, 1969లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు లత. ఫ్రాన్స్ ప్రభుత్వం 2006లో ది లీజియన్ అఫ్ హానర్ అవార్డును ఇచ్చింది. అంతేగాక.. 1989లో దాదా సాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషన్ అవార్డు, 1999లో ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డులతో పాటు.. శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలను అందించాయి.