Lata Mangeshkar : లతా మంగేష్కర్ మృతిపై మోదీ సంతాపం

లతా దీదీ మరణించినందుకు చాలా బాధ పడుతున్నట్లు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు...

Lata Mangeshkar : లతా మంగేష్కర్ మృతిపై మోదీ సంతాపం

Lata And Modi

PM Modi Mourns Lata Mangeshkar’s Death : ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. 92 సంవత్సరాల లతా మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పోరాడి ఓడిపోయారు. విషయం తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లతా దీదీ మరణించినందుకు చాలా బాధ పడుతున్నట్లు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు.

Read More : Chiranjeevi: కరోనా నుంచి రిలీఫ్.. వర్క్ మోడ్ లోకి మెగాస్టార్!

వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆమె పాడిన పాటలు ఎంతో పేరు గడించాయని, భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందాలని కోరుకునే వారన్నారు. ఆమె శూన్యాన్ని మిగిల్చిందని, రాబోయే తరాలు ఆమెను గుర్తు పెట్టుకుంటారన్నారు. ఆమె మధురమైన స్వరం..ప్రజలను మంతమగ్ధులను చేసిందని కొనియాడారు. ఆమెలో ఎనలేని అసమాన సామర్థ్యం కలిగి ఉందన్నారు. సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. భారతీయ సినీ నేపథ్య సంగీతానికి చిరునామాగా మారిన గానకోకిల లతామంగేష్కర్ ఇకలేరు.

Read More : Lata Mangeshkar : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. Live Updates

ఎవరి పేరు చెబితే…పాట సైతం తుళ్లిపడుతుందో…ఎవరి గొంతులో రాగంలా మారాలని పల్లవి పరితపిస్తుందో….ఆ గొంతు మూగబోయింది. భారతీయ సినిమా పాటను మహోన్నతశిఖరంపై ఉంచిన మధురగాయని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత నెల 11న కరోనాతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన లత తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు చేసిన పూజలు ఫలించలేదు. దాదాపు నెలరోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.