Radhe Shyam: రాధేశ్యామ్ పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఇదే?
ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. ఇండియన్ సూపర్ స్టార్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు విడుదల అయితే..
- Naresh Mannam
- Published On : January 30, 2022 / 02:02 PM IST
Radhe Shyam
Radhe Shyam: ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. ఇండియన్ సూపర్ స్టార్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు విడుదల అయితే.. ఇండియన్ హీరో నుండి గ్లోబల్ స్టార్ కావడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే.. సినిమాల విడుదలకి మాత్రం కరోనా మహమ్మారి బ్రేకులు వేసింది. జనవరిలో రాధే శ్యామ్ సినిమా తీసుకురావాలని ముహూర్తం పెట్టుకొని ప్రమోషన్ కూడా చేపట్టినా చివరి నిమిషంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
NTR 30-Thalapathy Vijay : అనిరుద్ ఫిక్స్.. హెయిర్ స్టైలిష్‌తో విజయ్..
అయితే.. ప్రస్తుతం కరోనా పీక్స్ దశలో ఉండగా ఇది ఫిబ్రవరి చివరికి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ల్యాబులలో ఉన్న సినిమాలు ఒక్కొకటి బయటకి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి నుండి వరసగా సినిమాల విడుదలకు ప్లాన్ జరుగుతుండగా మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఎప్పుడొస్తాయా అన్నది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మార్చి లేదా ఏప్రిల్ అని రెండు డేట్స్ ఇవ్వగా దాదాపుగా ఏప్రిల్ లోనే ఉండొచ్చని భావిస్తున్నారు.
Raviteja : సినిమా రిలీజ్ అవ్వకముందే ‘ఖిలాడీ’ డైరెక్టర్‌కి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత
ఇక, ఆ తర్వాత అవైటెడ్ సినిమా రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం మార్చి నెల మొదటి వారంలోనే రాధే శ్యామ్ రిలీజ్ కానుందని చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు ఉండగా మార్చి మొదటి వారానికి దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడతాయా అన్నది చూడాలి.
