Lavanya Tripathi new web series Miss Perfect Teaser released
Miss Perfect Teaser : హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకొని కొణిదెల వారి ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఈ సిరీస్ లో లావణ్య.. ఓవర్ క్లీన్‌నెస్ (OCD) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ పాత్రకి అన్నాయి కరెక్ట్ అండ్ క్లీన్‌గా ఉండాలి. అభిజీత్ మేల్ లీడ్ చేస్తున్నారు. అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ రిలీజ్ చేసిన టీజర్ లో పాత్రలని, వాటి స్వభావాలని మాత్రమే రివీల్ చేశారు. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. మరి ఆ టీజర్ ని మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Also read : #90’s Review : 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ.. ఇది అసలు కథ కాదు..