Lavanya Tripathi: పెళ్లి వార్తలపై లావణ్య క్లారిటీ.. ఏమందంటే..?

టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో లావణ్య సక్సెస్ అయ్యింది. ఇక టాలీవుడ్‌లో ఏకంగా దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Lavanya Tripathi On Rumours Of Marriage With Varun Tej

Lavanya Tripathi: టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో లావణ్య సక్సెస్ అయ్యింది. ఇక టాలీవుడ్‌లో ఏకంగా దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Varun Tej – Lavanya Tripathi : వరుణ్‌పై మనసు పారేసుకున్న అందాల రాక్షసి.. ప్రేమ వార్త నిజమేనా?

అయితే ఇటీవల లావణ్య పెళ్లి గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌తో లావణ్య గతకొంత కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తుందనే టాక్ తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఇటీవల నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే వరుణ్ తేజ్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తాడని నాగబాబు చెప్పుకొచ్చారు. దీంతో అందరూ వరుణ్ తేజ్ ఇంట్రొడ్యూస్ చేయబోయే అమ్మాయి ఖచ్చితంగా లావణ్య త్రిపాఠి అని అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ ఇదివరకే బెంగళూరులో లావణ్యకు ప్రపోజ్ చేశాడని.. దీనికి లావణ్య కూడా ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.

Lavanya Tripathi : అందమైన హావభావాలతో లావణ్య త్రిపాఠి

కాగా, తాజాగా ఈ వార్తలపై లావణ్య ఓ క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లికి సంబంధించిన వార్తను తానే ఖచ్చితంగా తెలియజేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తాను సినిమాలపైనే ఫోకస్ పెట్టానని.. పెళ్లి గురించి ప్రస్తుతం తానేమీ ఆలోచించడం లేదని లావణ్య తెలిపింది. దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకారేనని తేలిపోయింది.