Lavanya Tripathi : అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి..

తాజాగా లావణ్య త్రిపాఠి ఓ అనాధాశ్రమాన్ని సందర్శించింది. హైదరాబాద్ LB నగర్ లో మార్గం రాజేష్ అనే వ్యక్తి నడిపిస్తున్న అనాథశ్రమాన్ని లావణ్య సోమవారం నాడు సందర్శించింది.

Lavanya Tripathi visits Orphanage in Hyderabad

Lavanya Tripathi :  అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమాతో తెలుగు(Telugu) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులని మెప్పించింది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇప్పటికీ ఆ సినిమా ఒక క్లాసిక్ లా నిలిచింది. ఆ సినిమాలో లావణ్య పాత్ర మంచి సక్సెస్ అవ్వడంతో లావణ్యకు తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగు, తమిళ్(Tamil)లో లావణ్య వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ గత కొన్నాళ్లుగా లావణ్యకు మంచి హిట్ పడలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇప్పుడు వెబ్ సిరీస్(Web Series) లు కూడా చేస్తోంది.

96th Oscars : ఆస్కార్ 2024 డేట్స్ ఇవే.. ఈసారి ఇండియా నుంచి వెళ్తాయా??

తాజాగా లావణ్య త్రిపాఠి ఓ అనాధాశ్రమాన్ని సందర్శించింది. హైదరాబాద్ LB నగర్ లో మార్గం రాజేష్ అనే వ్యక్తి నడిపిస్తున్న అనాథశ్రమాన్ని లావణ్య సోమవారం నాడు సందర్శించింది. అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పింది. అనంతరం అనాథశ్రమంలోని పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి తను కూడా వారితో కలిసి భోజనం చేసింది. అలాగే ఆ పిల్లలకు కావాల్సిన అత్యవసర మందులను అందించింది. అనంతరం అక్కడి పిల్లలతో ఫోటోలు దిగింది లావణ్య. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.