గమనించారా? : ఎయిర్ పోర్టులో సూట్ కేస్ ను దారంతో లాగుతున్న బాలయ్య

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 02:04 AM IST
గమనించారా? : ఎయిర్ పోర్టులో సూట్ కేస్ ను దారంతో లాగుతున్న బాలయ్య

Updated On : May 28, 2020 / 3:43 PM IST

నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తన వయస్సు పెరగలేదనే సంకేతాలు ఇవ్వడానికి బాలయ్య చేస్తున్న ప్రయత్నాలు సినీ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం తర్వాత..కొద్దికాలం విరామం తీసుకున్నారు బాలయ్య. లెటెస్ట్‌గా కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా కోసం లుక్‌ని మార్చుకున్నారు. లెటెస్ట్ లుక్ చూసి అందరూ షాక్ తిన్నారు. అతి పెద్ద మొహం భీకరమైన గెడ్డంతో కనిపించిన బాలయ్య వెరైటీ గెడ్డం..చిత్రంగా పైకి దువ్విన క్రాఫ్..తో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి మారిపోయాడు. 

మరోసారి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిని జనం వైరల్ చేస్తున్నారు. కొత్త సినిమా ట్రైలర్‌లాగా బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వైట్ కలర్ బ్లేజర్ ధరించి..కళ్లద్దాలు ధరించి స్టైలిష్‌గా ఎయిర్ పోర్టులో బాలయ్య నడుస్తున్నాడు. సూట్ కేసును దూరంగా జరిపి..వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఆ సూట్ కేసు తిరిగి బాలయ్య దగ్గరకు చేరడం..తిరిగి దానిని దూరంగా నెట్టడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇది కావాలని చేసిందా..లేక సినిమా షూటింగ్‌లో భాగంగా చేశారా అనేది తెలియరావడం లేదు. 

Read More : బాలయ్యతో జనక్ జనక్ ‘పాయల్’ బాజే
బాలయ్య లెటెస్ట్ ఫిల్మ్‌లో విలన్‌గా జగపతి బాబు విలన్‌గా నటించనున్నారని సమాచారం. చిరంతన్ భట్ సంగీతమందిస్తాడని మాత్రమే మూవీ దర్శక, నిర్మాతలు కన్ఫమ్ చేసారు. వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన నటించనుందనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన నిర్మాత సి.కళ్యాణ్, బాలయ్య పక్కన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసాడని తెలుస్తుంది.