Rashmigautam : ఒక్క రూపాయి సాయం చేయాలంటున్న రష్మీ, ఎందుకో తెలుసా ?

సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటారు యాంకర్ రష్మీ. తాజాగా..సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో ‘ఒక్క రూపాయి’ సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు

Rashmi

Rashmigautam Instagram : బుల్లితెరపై ఎందరో మనస్సులను చూరగొన్న యాంకర్ లలో ‘రష్మీ’ ఒకరు. ఈమె పలు షోలో పాల్గొని..తన హావభావాలు, తన యాంకరింగ్ తో అభిమానులను మెస్మరైజింగ్ చేస్తున్నారు. అటు షోలో పాల్గొంటూనే…సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటోంది ఈ అమ్ముడు. సామాజిక కార్యక్రమాలపై ఫోకస్ చేస్తుంటారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంటారు రష్మీ. తాజాగా..సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో ‘ఒక్క రూపాయి’ సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.

Read More : Love Story : వినాయక చవితికి.. చైతు, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’..

ఒక్క రూపాయి ఎందుకు ?

నెల రోజుల క్రితం ఇషాన్ అనే కుక్క ప్రమాదవశాత్తు ఆరో అంతస్తు నుంచి కింద పడిపోయింది. దీంతో దీనికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా…చికిత్స చేయాలంటే..రోజుకు రూ. 300 నుంచి రూ. 400 అవుతుందని, ఇషాన్ నడవడానికి టైమ్ పడుతుందని వైద్యులు వెల్లడించారని రష్మీ తెలిపారు. అయితే.. అప్పటి వరకు చికిత్స అందించేందుకు తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

Read More :Calves : చిన్న వయస్సు లేగ దూడలు… పాడిరైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

అందరం సాయం చేస్తే…ఇషాన్ చికిత్సకు ఇబ్బందులు తొలుగుతాయని నెటిజన్లను కోరారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో తనను ఫాలో అయ్యే వారు 3.7m ఫాలోవర్స్ ఉన్నారు..ఒక్కొక్కరు ఒక్క రూపాయి సాయం చేసినా…అది చాలా పెద్దవుతుందని చెప్పారు. ఈ అమౌంట్ చికిత్సకు చాలా అవసరం పడుతుందని, డోనేట్ చేయాల్సిన లింక్ కూడా షేర్ చేస్తున్నట్లు రష్మీ వెల్లడించారు. మూగజీవాలపై రష్మీ కురిపిస్తున్న ప్రేమను నెటిజన్లు అభినందిస్తున్నారు.