Puri Jagannadh : అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షిట్లు ఇవ్వొద్దు.. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం!

లైగర్ సినిమా వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్ల హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పూరీ జగన్నాథ్ మాట నిలబెట్టు..

Liger Director Puri Jagannadh : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన సినిమా లైగర్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది. దీంతో ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ల వరకు ప్రతి ఒక్కరు భారీగా నష్టపోయారు. అయితే లైగర్ సినిమా ద్వారా తమకి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలనీ దర్శకుడు మరియు నిర్మాత పూరీ జగన్నాథ్ ని ఎగ్జిబిటర్ల కోరడం, అది కాస్త గొడవగా మారి పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే.

Celebrities Looks : టవల్‌తో బిగ్‌బాస్ బ్యూటీ.. బనీన్‌లో దిశా పటాని..

తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ వద్ద లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని విడుదల చేసిన తమకి సుమారు 9 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ నష్టాన్ని నుంచి తమని ఎగ్జిబిటర్లను ఆదుకుంటానని, తమకి జరిగిన నష్టాన్ని ఆరు నెలల్లో తీరుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని వెల్లడించారు. లైగర్ చిత్ర విషయంలో పూరీ జగన్నాథ్ మాట నిలబెట్టుకోవాలని కోరిన ఎగ్జిబిటర్ల.. అంతవరకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సహా ఇతర అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్ కు కాల్షిట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?

ఇక ఈ ఆందోళనను తెలుగు ఫిల్మ్ చాంబర్.. లైగర్ మరో నిర్మాత ఛార్మి దృష్టికి తీసుకెళ్లింది. ఫిల్మ్ చాంబర్ సమాచారంతో స్పందించిన చార్మి.. విషయమంతా తనకు తెలుసని, ఎగ్జిబిటర్ల అందరికి మేలు జరిగేలా కృషి చేస్తున్నామని ఒక మెయిల్ ద్వారా సమాచారం పంపింది. మరి ఈ గొడవ ఎప్పటికి తీరుతుందో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు