Little Hearts
Little Hearts : ఇటీవల భారీ పాన్ ఇండియా సినిమాల కంటే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ లిస్ట్ లోమరో సినిమా చేరింది. మౌళి తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇటీవల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజయింది.(Little Hearts)
2015 ఇంటర్, ఎంసెట్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి కామెడీ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకేక్కిన్చారు. సినిమా చూస్తున్నంతసేపు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉండొచ్చు. ఈ సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద విజయం సాధించింది.
Also See : Kushitha Kallapu : ఓనం స్పెషల్ చీరకట్టులో కుషిత కళ్లపు.. ఫొటోలు..
ఈ సినిమా ఈటీవీ విన్ తమ ఓటీటీ కోసం రెండు కోట్లు పెట్టి చేసుకున్నారు. అయితే సినిమా బాగుండటంతో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని కోటి రూపాయలు థియేట్రికల్ రైట్స్ కొని, కోటి రూపాయలు పబ్లిసిటీకి ఖర్చుపెట్టి రిలీజ్ చేసారు. లిటిల్ హార్ట్స్ సినిమా ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమా మూడు రోజుల్లో నిన్న ఆదివారం వరకు ఏకంగా 12.21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
మొదటి రోజే 2.54 కోట్లు వసూలు చేయగా సినిమా హిట్ టాక్ రావడంతో రెండో రోజు 4 కోట్లకు పైగా, మూడో రోజు 5 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావడంతో ఆల్మోస్ట్ 4 కోట్ల ప్రాఫిట్స్ లో దూసుకుపోతున్నారు. ఇవాళ సోమవారం అయినా సాయంత్రం బుకింగ్స్ బాగున్నాయి.
Also See : Srija Dammu : బిగ్ బాస్ లోకి కామన్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ దమ్ము.. ఫొటోలు..
ఇక ఈ సినిమాతో పాటు అనుష్క ఘాటీ సినిమా, శివ కార్తికేయన్ మదరాసి సినిమాలు రిలీజయినా అవి తెలుగులో అడ్రెస్ లేకుండా పోయాయి. అనుష్క ఘాటీ సినిమా కేవలం మూడు రోజుల్లో 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. 12 వ తారీఖున వేరే సినిమాలు ఉన్నాయి కాబట్టి 11వ తారీఖు వరకు లిటిల్ హార్ట్స్ సినిమా కలెక్షన్స్ కు ఢోకా లేనట్టే. ఇంకా షోలు పెంచుతున్నారు.