Little Hearts : ఇండియాలో ఆ సీన్స్ కట్ చేశారెందుకు బ్రో..? ఓవర్సీస్ లో ‘లిటిల్ హార్ట్స్’ స్పెషల్ సీన్స్..

యూత్ ఫుల్ లవ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. (Little Hearts)

Little Hearts

Little Hearts : మౌళి, శివాని జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా లిటిల్ హార్ట్స్ టీమ్ ని అభినందిస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ఫుల్ సక్సెస్ లో మునిగిపోయింది.(Little Hearts)

యూత్ ఫుల్ లవ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇందులో ప్రతి సీన్ ని ఎంజాయ్ చేశారు. అయితే ఇండియాలో క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ కట్ చేసారంట. ఓవర్సీస్, అమెరికా ప్రింట్ లో క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఎక్స్‌ట్రా వచ్చాయని అంటున్నారు. ఓవర్సీస్ ప్రేక్షకులు థియేటర్ నుంచి ఓ వీడియో షేర్ చేయడంతో ఆ సీన్ సినిమాలో ఎక్కడ ఉంది, ఇండియా ప్రింట్ లో కట్ చేసారా అంటూ నెటిజన్లు మూవీ టీమ్ ని ప్రశ్నిస్తున్నారు.

Also See : Premi Vishwanath : కార్తీక దీపం వంటలక్క.. ఓనం సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

సాధారణంగా సెన్సార్ ని దృష్టిలో పెట్టుకొని ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమాకు, ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యే సినిమాకు కొంత తేడా కచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ లిటిల్ హార్ట్స్ కి కట్ చేసింది క్యూట్ సీన్. మరి ఇది ఎందుకు ఇండియా ప్రింట్ లో కట్ చేసారో మూవీ యూనిట్ కే తెలియాలి. అలాగే ఈ సినిమాలో ఎడిటింగ్ లో కట్ చేసిన సీన్స్ యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు.

 

Also Read : OG Song : పవర్ స్టార్ OG నుంచి.. అదిరిపోయే గన్స్ & రోజెస్ సాంగ్ వచ్చేసింది..