Site icon 10TV Telugu

Lokah Chapter 1: Chandra : ఇందుకే కదా మలయాళం సినిమాలని పొగిడేది.. జస్ట్ 30 కోట్ల బడ్జెట్.. భారీ విజువల్స్.. కలెక్షన్స్ అదుర్స్..

Lokah Chapter 1: Chandra Movie Once again Proved Malayalam Movies are Best in Making under small Budget

Lokah Chapter 1: Chandra

Lokah Chapter 1: Chandra : మలయాళం సినిమాలు సూపర్, వాళ్ళ దగ్గర కంటెంట్ సినిమాలు ఉంటాయి, తక్కువ బడ్జెట్ తో తీస్తారు అని రెగ్యులర్ గా ఇటీవల వింటూనే ఉన్నాము. టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం మలయాళం సినిమాలను, సినీ పరిశ్రమని కొన్ని విషయాల్లో పొగుడుతారు. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళం సినిమా వచ్చింది అంటే మంచి కంటెంట్ ఉందని నమ్మి వెళ్తున్నారు అనుకున్నట్టే అవి మెప్పిస్తున్నాయి.(Lokah Chapter 1: Chandra)

ఇటీవల పలు మలయాళ సినిమాలు వరుసగా తెలుగులో రిలీజయి హిట్ కొడుతున్నాయి. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోక చాప్టర్ 1: చంద్ర చర్చగా మారింది. ఈ సినిమా ఇటీవల ఆగస్టు 29 రిలీజయి మంచి హిట్ కొట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ దాటేసింది. వంద కోట్ల టార్గెట్ తో దూసుకుపోతుంది.

Also Read : Pawan Kalyan Birth Day : రేపే పవర్ స్టార్ బర్త్ డే.. అప్డేట్స్ ఏంటి మరి..? మూడు సినిమాల నుంచి..?

లోక చాప్టర్ 1: చంద్ర

లోక చాప్టర్ 1: చంద్ర ఒక సూపర్ వుమెన్ కాన్సెప్ట్ తో ఓ కొత్త సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి తెరకెక్కించారు. సినిమా చూస్తే ఏ 100 కోట్ల పైన బడ్జెట్ పెట్టి ఉంటారు అనిపిస్తుంది. కానీ ఆ సినిమా బడ్జెట్ కేవలం 33 కోట్లు. ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. సినిమా చూస్తే విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. లొకేషన్స్ అదిరిపోతాయి. కానీ సినిమా ఆల్మోస్ట్ తీసింది రెండు సెట్స్ లోనే. ఇంకో రెండు మూడు లొకేషన్స్ లో అంతే.

2018, ప్రేమలు, తుడురమ్, మంజుమెల్ బాయ్స్, రోమాంచమ్, సూక్ష్మదర్శిని, పోన్ మెన్.. ఇలా ఇటీవల మలయాళ సినిమాలు తెలుగులో అదరగొడుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో లోక చాప్టర్ 1: చంద్ర చేరింది. తెలుగులో నిర్మాత నాగవంశీ ఈ సినిమాని తక్కువకే రైట్స్ తీసుకొని రిలీజ్ చేయగా ఇక్కడ కూడా కలెక్షన్స్ అదరగొడుతుంది ఈ సినిమా.

సినిమా చూసిన వాళ్లంతా అసలు 30 కోట్ల బడ్జెట్ లో ఇలాంటి గ్రాండ్ విజువల్స్ ఎలా ఇచ్చారు అని ఆశ్చర్యపోతున్నారు. మలయాళం వాళ్ళు స్టార్స్ కి రెమ్యునరేషన్స్ భారీగా ఇవ్వకుండా సినిమా మేకింగ్ మీద ఖర్చుపెడతారు అని మనవాళ్లే చెప్తారు. లోక చాప్టర్ 1: చంద్ర సినిమా మరోసారి అది నిజం అని నిరూపించింది. ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగు సినీ పరిశ్రమ బడ్జెట్, మేకింగ్ విషయాల్లో మలయాళ సినీ పరిశ్రమ నుంచి నేర్చుకోవడంలో తప్పు లేదు అని నెటిజన్లు, సినీ ప్రేమికులు అంటున్నారు.

Also Read : Kotha Lokah Chapter 1: Chandra : ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ మూవీ రివ్యూ.. మలయాళంలో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్..

అన్ని పరిశ్రమలు వేయి కోట్ల కలెక్షన్స్, వందల కోట్ల బడ్జెట్స్ తో భారీ సినిమాలు ప్లాన్ చేసుకొని ఏదో చిన్న చిన్న లాభాలతో గట్టెక్కుతుంటే.. మలయాళం సినీ పరిశ్రమ మాత్రం తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు అందించి మాములు టికెట్ రేట్లతోనే భారీ లాభాలు పొందుతుంది. జనాలు కూడా ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు.

అయితే ఇటీవల కొంతమంది తెలుగు దర్శకులు ఇదేదో వర్కౌట్ అవుతుందని మాది మలయాళం లాంటి కంటెంట్ సినిమా అని చెప్పి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. తీరా సినిమాకి వెళ్తే అవి అంత గొప్పగా ఉండవు. ఇటీవల ఇద్దరు తెలుగు డైరెక్టర్స్ అదే మాట చెప్పి ప్రమోషన్స్ చేసి ప్రేక్షకులను ఫూల్స్ చేసారని సినిమా లవర్స్ అంటున్నారు. మలయాళం లాంటి సినిమా అని చెప్పి ప్రమోట్ చేసే బదులు మంచి కంటెంట్ తీయొచ్చు కదా అని నెటిజన్లు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరోసారి లోక చాప్టర్ 1: చంద్ర సినిమాతో ఇందుకే కదా మలయాళం సినిమాలను పొగిడేది అని అందరూ అంటున్నారు.

Exit mobile version