Kotha Lokah Chapter 1: Chandra : ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ మూవీ రివ్యూ.. మలయాళంలో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్..
ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా తెరకెక్కుతుండగా ఇందులో మొదటి చాప్టర్ గా చంద్ర అనే సూపర్ వుమెన్ ని చూపించారు.(Kotha Lokah Chapter 1: Chandra)

Kotha Lokah Chapter 1: Chandra
Kotha Lokah Chapter 1: Chandra : మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ పై డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళం సినిమా ‘లోక చాప్టర్ 1: చంద్ర’. తెలుగులో ఈ సినిమాని ‘కొత్త లోక 1: చంద్ర’ గా ఆగస్టు 29న రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్, పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Kotha Lokah Chapter 1: Chandra)
కథ విషయానికొస్తే.. చంద్ర(కళ్యాణి ప్రియదర్శన్) కు కొన్ని పవర్స్ ఉంటాయి. ఒక సూపర్ వుమెన్ లాంటిది. ఎక్కడ్నుంచో వచ్చి ఒక ఊరిలో నివాసం ఉంటుంది. ఆమె నైట్ టైం మాత్రమే బయటకు వచ్చి పనిచేసుకుంటుంది. తన ఎదురు ఫ్లాట్ లో ఉన్న సన్నీ(నస్లేన్) ఆమెని చూసి ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఒక రౌడీ ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే చంద్ర అతన్ని కొడుతుంది. నాచియప్ప(శాండీ మాస్టర్) అనే పోలీస్ కి ఈ విషయం తెలిసి చంద్రని టార్గెట్ చేస్తాడు.
మరో వైపు సిటీలో కొంతమంది మాయమవడం, ఆర్గాన్ మాఫియా జరుగుతూ ఉంటుంది. సన్నీకి ఈ విషయంలో చంద్ర మీద అనుమానమొచ్చి ఆమెని ఫాలో అవుతాడు. అదే సమయంలో రౌడీ చంద్రని చంపడానికి కిడ్నప్ చేస్తాడు. కానీ చంద్ర వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళను కొరికి మరీ చంపేస్తుంది. ఇదంతా సన్నీ చూసి భయపడతాడు.
ఆ ఊళ్ళో కొన్ని వందల ఏళ్ళ క్రితం ఒక రాజు ఒక తెగని అంతం చేయబోతుండగా నీల అనే పాపకు ఏదో శక్తి వచ్చి రాజు మనుషులను కొంతమందిని చంపేసి పారిపోయి యక్షిణి అవుతుందని కథ చెప్పుకుంటారు. ఆ యక్షిణి ఎవరు, ఆమెకు చంద్రకు సంబంధం ఏంటి? అసలు చంద్రకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? చంద్ర ఎక్కడ్నుంచి వచ్చింది. సన్నీకి చంద్ర గురించి తెలిసి ఏం చేస్తాడు? చంద్ర కేవలం రాత్రి పూటే ఎందుకు బయటకు వస్తుంది? ఆమెకు సన్ లైట్ తగిలితే ఏం జరుగుతుంది? పోలీస్ చంద్రని ఏం చేస్తాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Arjun Chakravarthy : ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ రివ్యూ.. కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ కథ..
సాంకేతిక విశ్లేషణ..
దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా తెరకెక్కుతుండగా ఇందులో మొదటి చాప్టర్ గా చంద్ర అనే సూపర్ వుమెన్ ని చూపించారు. హాలీవుడ్ DC, మార్వెల్ సినిమాల్లో చూపించే లాగా చావు లేకుండా, కొంతమంది సూపర్ పవర్స్ ఉన్న పాత్రలతో ఒక్కో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని భాషల్లో లోక అనే టైటిల్ తో రిలీజయినా తెలుగులో ఆ టైటిల్ అందుబాటులో లేకపోవడంతో కొత్త లోక అనే టైటిల్ తో రిలీజ్ చేసారు.
ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. చంద్ర అసలు ఎవరు? ఏంటి అనే క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేసారు. యక్షిణి కథ కూడా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ కి చంద్ర అసలు రూపం చూపించి వావ్ ఇదేదో కొత్తగా ఉందే అనిపించి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పేలా చేసారు. సెకండ్ హాఫ్ అంతా చంద్ర, సన్నీ, పోలీస్ చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. ఇక చంద్ర లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలియడం, వాళ్లంతా ఒక గ్రూప్ అని, ఆ గ్రూప్ కి ఒక హెడ్.. ఇదంతా అర్ధం కాకుండా సాగుతుంది. చంద్ర ఎవరు అనేది క్లారిటీ ఇచ్చినా మిగిలిన వాళ్ళ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో చంద్ర పాత్రకు ప్రాపర్ ఎండింగ్ లేకుండా ఇచ్చారు. చంద్ర లాంటి వాళ్ళు ఒక వైరస్ వల్ల ఇలా ఉంటున్నారని అది కాస్త కన్విన్స్ గానే చెప్పగలిగారు.(Kotha Lokah Chapter 1: Chandra)
అక్కడక్కడా భయంతో వచ్చే కామెడీ కూడా బాగానే వర్కౌట్ చేసారు. వీటికి సీక్వెల్స్ ఉంటాయి కాబట్టి సినిమా అర్దాంతరంగా ముగించేసారు. దుల్కర్ సల్మాన్ క్లైమాక్స్ లో వచ్చి తనకు కూడా ఈ యూనివర్స్ లో సపరేట్ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. డైరెక్టర్ ఒక కొత్త ఆసక్తికర సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాడు అని చెప్పొచ్చు. సరికొత్త పాయింట్ ని తీసుకున్నా ఫస్ట్ పార్ట్ లోనే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పి నెక్స్ట్ ఎవరి కథ చూపిస్తాడు, దీనికి లింక్ ఉంటుందా అనే ఆసక్తి నెలకొల్పారు. మరి ఇందులో తర్వాత వచ్చే సినిమాలు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కళ్యాణి ప్రియదర్శన్ తన పాత్రలో అదరగొట్టేసింది. యాక్షన్స్ సీక్వెన్స్ లలో బెస్ట్ ఇచ్చింది. ప్రేమలు ఫేమ్ నస్లేన్ అల్లరిగా తిరిగే యువకుడి పాత్రలో బాగానే మెప్పించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో శాండీ మాస్టర్ బాగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతిక అంశాలు..
సినిమా కథ అంతా ఆల్మోస్ట్ రాత్రి పూటే ఉంటుంది. అందుకు తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. సినిమా అంతా రెండు మూడు లొకేషన్స్ లోనే నడుస్తుంది. దీని కోసం అంతా ఒక రెండు సెట్స్ వేసుకున్నారు కానీ ఎక్కడా నార్మల్ ప్రేక్షకులకు సెట్ అని అనుమానం రాకుండా కెమెరా విజువల్స్ తో మాయ చేసారు. కొత్త కథ తీసుకున్నా స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ అనిపిస్తుంది. సాంకేతికంగా దర్శకుడు బాగానే డీల్ చేసాడు. నిర్మాతగా దుల్కర్ తక్కువ బడ్జెట్ లో బెస్ట్ అవుట్ పుట్ సినిమా ఇచ్చాడు అని కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ మాత్రం పర్వాలేదనిపిస్తాయి.
మొత్తంగా ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కథలోని ఓ సూపర్ వుమెన్ పాత్రతో తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.