Lokesh Kanagaraj Next Movie With Raghava Lawrence
Lawrence: స్టార్ కొరియోగ్రఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ నటించిన ‘రుద్రుడు’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తరువాత లారెన్స్ సినిమా రావడంతో, ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర సరికొత్తగా ఉంటుందని.. అభిమానులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని లారెన్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో తెలిపాడు. ఈ సినిమా తరువాత ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నట్లు లారెన్స్ చెప్పుకొచ్చాడు.
Raghava Lawrence : నువ్వు దేవుడివి సామి.. ఇంకో 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న లారెన్స్..
దీంతో లారెన్స్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తున్నాడా అని కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే లారెన్స్ చేయబోయేది తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో అని తెలుస్తోంది. లోకేశ్ ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతుంది. ఈ సినిమా తరువాత లోకేశ్, లారెన్స్ నటించే సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Raghava Lawrence: కృష్ణంరాజు గారిని కడసారి చూసుకోలేకపోవడం నా దురదృష్టకరం.. రాఘవ లారెన్స్
ఈ సినిమాను లోకేశ్ అసిస్టెంట్స్‌లో ఒకరు డైరెక్ట్ చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి లారెన్స్ కోసం లోకేశ్ ఎలాంటి కథను పట్టుకొస్తాడా.. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.