‘నిశ్శబ్దం’- మైకేల్ మ్యాడ్‌సన్ లుక్

‘నిశ్శబ్దం’ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ ‘రిచ‌ర్డ్ డికెన్స్’ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు..

  • Published By: sekhar ,Published On : November 22, 2019 / 07:44 AM IST
‘నిశ్శబ్దం’- మైకేల్ మ్యాడ్‌సన్ లుక్

Updated On : November 22, 2019 / 7:44 AM IST

‘నిశ్శబ్దం’ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ ‘రిచ‌ర్డ్ డికెన్స్’ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు..

అనుష్క, విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్‌సన్ లుక్ రిలీజ్ చేశారు. మైకేల్ న‌టుడిగానే కాక, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత, ఫొటోగ్రాఫ‌ర్‌గానూ సత్తా చాటారు.

ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌ంతో పాటు అంత‌ర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న మైకేల్ ‘నిశ్శ‌బ్దం’ లో రిచ‌ర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క పెయింటర్‌గా, మాధవన్ మ్యుజిషియన్‌గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్‌గా కనిపించనున్నారు..

Read Also : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ‘‘దొంగ’’

షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు  తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ లేదా 2020 జనవరిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, నిర్మాతలు : కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్.