ఓడిపోవడం అంటే దారులు లేకపోవడం కాదు.. ఉన్నదారి వెతుక్కోలేక పోవడం..

ఆసక్తికరంగా Loser ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : May 9, 2020 / 02:09 PM IST
ఓడిపోవడం అంటే దారులు లేకపోవడం కాదు.. ఉన్నదారి వెతుక్కోలేక పోవడం..

Updated On : May 9, 2020 / 2:09 PM IST

ఆసక్తికరంగా Loser ట్రైలర్..

ప్రస్తుత తరుణంలో వెబ్ సిరీస్‌‌లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్.. అదే కోవలో జీ5 ఓ సరికొత్త కథాంశంతో Loser అనే సిరీస్ తెరకెక్కించింది.

తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జీవితంలో ఓ లక్ష్యం ఏర్పరచుకుని అనుకోని పరిస్థితులు, సొంత కారణాల వల్ల వాటిని చేరుకోలేకపోవడం అనేది ఈ ట్రెలర్‌లో ప్రధానంగా కనిపించింది. ప్రియదర్శి, శశాంక్, పావని గంగిరెడ్డి, కోమలి ప్రసాద్, కల్పిక, షాయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డైలాగ్స్, ఫొటోగ్రఫీ, ఆర్ఆర్ బాగున్నాయి.