Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్
ఎప్పుడూ ఒకరి మీద ఒకరు నిందలు.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడమే కాదు.. ఒకరి బాధలు ఒకరు పంచుకోవడానికి కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వడంతో ఈ గురువారం నాటి ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది.
- Naresh Mannam
- Published On : September 24, 2021 / 07:25 AM IST
Big Boss 5
Big Boss 5: ఎప్పుడూ ఒకరి మీద ఒకరు నిందలు.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడమే కాదు.. ఒకరి బాధలు ఒకరు పంచుకోవడానికి కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వడంతో ఈ గురువారం నాటి ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది. ఇంటిలో కెపెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యుల జీవితంలో చోటుచేసుకొన్న ప్రేమ కథలు, బ్రేకప్, విషాద సంఘటనలను తోటి కంటెస్టెంట్స్, ప్రేక్షకులతో పంచుకొనే అవకాశాన్ని బిగ్ బాస్ ఇవ్వడంతో ఇంటి సభ్యులు తమ ప్రేమ కథలు చెప్పుకొన్నారు.
Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?
ఈ సందర్భంగా సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ‘అతడి పేరు విష్ణు, ముద్దుగా చిన్నూ అంటాను. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. మావి ఎదురెదురు ఇల్లులు. ఒకసారి నాకు ప్రపోజ్ చేశాడు, నేను ఓకే చెప్పాను. తను చాలా పొసెసివ్.. ఒకసారి మాకు పెద్ద గొడవైంది. అదే సమయంలో నాకు పెళ్లి సంబంధం రావడం.. రేపు ఎంగేజ్‌మెంట్ అనగా చిన్నూ నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడ్చేయడం.. నాకు తనంటే చెప్పలేని ఇష్టం కావడంతో తెల్లవారితే ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయామని చెప్పింది.
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
చివరికి వాళ్ళ అమ్మ సిరితో మాట్లాడి ఇంటికి తీసుకురాగా కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండడం.. ఓ రోజు ఉదయం యాక్సిడెంట్ లో తను చనిపోయాడని వార్త వినాల్సి వచ్చిందని.. తన కోసం నేను ఎంతో చేశా, కానీ ఆ దేవుడు తనను నాకివ్వలేదని ఐ లవ్ యూ సో మచ్’ అంటూ సిరిసిరి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంటి సభ్యులు వచ్చి ఆమెను ఓదార్చారు. ప్రియాంకా సింగ్ వచ్చి బెలూన్ రూపంలో నీ ప్రేమను పైకి వదిలేయమని చెప్పింది. అలా వదిలితే నీ ప్రేమ విష్ణుకు చేరుతుందని సిరికి ప్రియాంక ఉపశమనం కలిగించే మాటలను చెప్పింది.
