Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమవుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్‌, ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్ర, ప్రియ, లహరి ఉన్నారు.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

Bigg Boss 5

Updated On : September 24, 2021 / 8:08 AM IST

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమవుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్‌, ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్ర, ప్రియ, లహరి ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటికే కొందరు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో సపోర్ట్ కనిపిస్తుంది. అందరిలో ప్రియా, లహరీలకే ఎక్కువగా డేంజర్ కనిపిస్తుంది. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ..తన ఆట తాను ఆడే మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నట్లు కనిపిస్తుండగా.. అటు శ్రీరామ్‌కు ఫ్యాన్స్‌ సపోర్ట్ బలంగా కనిపిస్తుంది.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

ఇక ప్రియాంక సింగ్‌ మీద అభిమానులలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తుండగా ఇక మిగిలిందల్లా ప్రియ, లహరి. నామినేషన్స్‌ జరిగినరోజు ప్రియ మీద తీవ్రమైన ట్రోలింగ్‌ జరిగింది. అయితే, రవి.. లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ప్రియపై కాస్త నెగెటివిటీ తగ్గడంతో ఇక లహరి డేంజర్ జోన్ లో కనిపిస్తుంది. లహరీకి అంతగా ఫ్యాన్‌ బేస్‌ లేకపోవడం కూడా ఆమె డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ​కానీ లహరికి సానుభూతి ఓట్లు పడితే మాత్రం ఆమె కచ్చితంగా సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది.

Brahmamgari Matam: 2 నెలల్లో పీఠాధిపతి నియామకం పూర్తి చేయాల్సిందే!

అయితే, ఈ వారం లహరి ఎలిమినేషన్ అయితే మాత్రం అందులో రవి, ప్రియల వాటా స్పష్టంగా ఉండనుంది. ఎందుకంటే నామినేషన్స్‌ కన్నా ముందు అతడు ప్రియ దగ్గర లహరి గురించి కొంత బ్యాడ్‌గా చెప్పాడు. లహరి యాంకర్‌ అవడానికి తన పనులన్నీ చేసి పెడుతూ తన వెంటే తిరుగుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని రవి ప్రియ దగ్గర చెప్పుకున్నాడు. ఆ తర్వాత రవి ఆ విషయాన్ని తూచ్ తాను చెప్పనేలేదని వాపోయాడు. ఇక ప్రియ రవి, లహరి వ్యవహారాన్ని పెద్ద ఇష్యూ చేసి మిడ్‌నైట్‌ హగ్గు అంటూ దారుణంగా మాట్లాడింది. ఆ తర్వాత ప్రియా కూడా సారీ చెప్పేసింది. కానీ లహరికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మరి వీక్షకులు ఈ విషయాన్ని గమనించి సపోర్ట్ చేస్తే లహరి హౌస్ లో కొనసాగడం లేదంటే వీడడం జరగడం ఖాయంగా కనిపిస్తుంది.