హ్యపీ బర్త్‌డే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య

  • Published By: sekhar ,Published On : November 23, 2020 / 06:41 PM IST
హ్యపీ బర్త్‌డే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య

Updated On : November 23, 2020 / 7:07 PM IST

Happy Birthday Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు నేడు (నవంబర్ 23).. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ మూవీ నుండి న్యూ పోస్టర్‌ రిలీజ్ చేశారు.Naga Chaitanyaబనియన్, లుంగీ గెటప్‌లో పక్కింటబ్బాయిలా కనిపించి ఆకట్టుకున్నాడు చైతు.
ఈ చిత్రం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదల తేది విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.


దీంతో పాటు అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు చైతన్య. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. Naga Chaitanya‘జోష్’ తో కెరీర్ స్టార్ట్ చేసి, సినిమా సినిమాకు నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.