Lucky Bhaskar movie enter into 100 crore club
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీభాస్కర్ మూవీ అరుదైన క్లబ్‌లో చేరింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఓ స్పెషల్ పోస్టర్ ను సైతం విడుదల చేసింది.
విడుదలైన 14 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.009 బిలియన్ రూపాయలు సాధించినట్లు తెలిపింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
Kasthuri : తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి కస్తూరికి మద్రాసు హైకోర్టు షాక్..
సచిన్ ఖేడేకర్, సాయికుమార్ లు కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు.
Matka Twitter Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్విట్టర్ రివ్యూ..
𝟏 𝐁𝐈𝐋𝐋𝐈𝐎𝐍 𝐑𝐔𝐏𝐄𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 💰💵
The 𝐌𝐄𝐆𝐀 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 #LuckyBaskhar made it to the TOP, With a 100% strike rate at the Box-Office. 🏦
Watch #BlockbusterLuckyBaskhar at Cinemas Near you! 🤩@dulQuer… pic.twitter.com/JYS05A9f05
— Sithara Entertainments (@SitharaEnts) November 14, 2024