Chandrabose : నా మనసులోని భావాలే ‘నాటు నాటు’.. ఆస్కార్ నామినేషన్ పై చంద్రబోస్ రియాక్షన్..

తాజాగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన................

Chandrabose :  ప్రపంచాన్ని, హాలీవుడ్ ని ఊపేసిన RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవార్డు అయిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచాయి. ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్ సాధించిన మొదటి సాంగ్ కావడంతో RRR సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో ప్రేక్షకులు, నెటిజన్లు, సినీ ప్రేమికులు, సినీ, రాజకీయ ప్రముఖులు చిత్రయూనిట్, రాజమౌళి, కీరవాణిని అభినందిస్తున్నారు.

ఈ పాటకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా చంద్రబోస్ పాటని రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. నాటు నాటు పాటని రాయడానికి 9 నెలలు పట్టిందని, పాటు షూటింగ్ టైములో చివరి నిమిషంలో కూడా పాటలో కొన్ని లైన్స్ ని మార్చామని గతంలోనే చంద్రబోస్ చెప్పారు.

Naatu Naatu Song : ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్స్ పై ప్రముఖుల ప్రశంసలు..

తాజాగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కీరవాణి, రాజమౌళికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాలాంటి సామాన్య రచయితకి ఇది చాలా గొప్ప విజయం. నాటు నాటు పాట రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో నేను రాసిన ప్రతి పదం, నా చిన్నప్పటి పరిస్థితులు, నా మనస్సులోని భావాల్లోంచి వచ్చిందే. నా మనస్సులోని భావాలకు అక్షర రూపం ఇచ్చాను. ఆస్కార్ నామినేషన్ లో ఈ పాట ఉండటం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. హాలీవుడ్ పాటలకి ధీటుగా పోటీలో నిలిచింది అని అన్నారు. ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో నాటు నాటు పాట నిలిచింది. రిజల్ట్ తెలియాలంటే మార్చ్ 13 వరకు వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు