MAA Elections: ఈసీతో కార్యనిర్వాహక కమిటీ భేటీ.. ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? అంటే సూటిగా సమాధానం దొరకడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ ఎన్నికలపై ప్రస్తుతం సందిగ్దత కొనసాగుతుంది.

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? అంటే సూటిగా సమాధానం దొరకడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ ఎన్నికలపై ప్రస్తుతం సందిగ్దత కొనసాగుతుంది. ఒకవిధంగా వేడి చల్లారేందుకే పరిశ్రమ పెద్దలు ఇది వాయిదా వేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కాగా, మరోవైపు అదే పెద్దలు ఈ ఎన్నికల వివాదంపై కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు నిర్వహించాలా?.. సామరస్యంగా ఈ ఎన్నికలను ఎలా ముగించాలి? ఒకవేళ ఏకగ్రీవంగా ఎంపిక చేయాలంటే ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనే అంశాలపై తీవ్ర కసరత్తులు జరుగుతున్నట్లు కూడా వినిపించింది. అంతేకాదు, ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించే ఉద్దేశ్యం లేదని.. దీని కోసం బైలా పరిశీలన కూడా జరిగినట్లు పలు చర్చలు సాగాయి.

అయితే, మరో రెండు రోజులలో ఈ ఎన్నికల నిర్వహణపై కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి కార్యనిర్వాహక కమిటీ ఈసీతో వర్చువల్ గా సమావేశమవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈభేటీలో ఎన్నికల తేదీ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం `మా` క్రమశిక్షణం కమిటీ అధ్యక్షులుగా ఉన్న కృష్ణంరాజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సమావేశంలో కృష్ణంరాజుతో పాటు లీగల్ అడ్వైజర్ ఆడిటర్ సహా ఈసీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారట. ఈ సమావేశం అనంతరం మా ఎన్నికలతో పాటు మరికొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రమశిక్షణ తప్పుతుందనే భావనపై కొంతకాలంగా మదనపడుతున్న పెద్దలు ఈ సమావేశం అనంతరం పరిశ్రమపై పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకొనే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు