Maremma : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. పవర్ ఫుల్ లుక్ లో.. టైటిల్ ఏంటో తెలుసా?
హీరో రవితేజ సోదరుడు నటుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Maadhav Maremma First Look Unveiled
హీరో రవితేజ సోదరుడు నటుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మారెమ్మ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మాధవ్ లుక్ అదిరిపోయింది.
చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపిస్తున్నాడు. మొత్తానికి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయాయి.
వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో దీపా బాలు కథానాయిక. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.