Emoji : ‘ఎమోజీ’ మూవీ రివ్యూ.. లవ్ బ్రేకప్ అయిన ఇద్దరు పెళ్లి చేసుకొని..

ప్రస్తుతం ఎమోజీ సినిమా ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.

Maanasa Choudhary Aha OTT Emoji Movie Review

Emoji Movie Review : ఆహా ఓటీటీ వేరే భాషల్లోని సినిమాలు, సిరీస్ లను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ్ లో రెండేళ్ల క్రితం రిలీజయిన ఎమోజీ వెబ్ సిరీస్ ని కొంత ఎడిటింగ్ చేసి తెలుగులో సినిమాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఎమోజీ సినిమా ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సంపత్ కుమార్ నిర్మాణంలో రంగస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహత్ రాఘవేంద్ర హీరోగా మానస చౌదరి, దేవిక సతీష్ హీరోయిన్స్ గా నటించారు.

కథ విషయానికొస్తే.. ఆదవ్(మహత్ రాఘవేంద్ర) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆదవ్ ఓ రోజు ఒక స్పోర్ట్స్ షాప్ కి వెళ్తే అక్కడ పనిచేస్తున్న ప్రార్థన(మానస చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నాక అప్పుడప్పుడు ప్రార్థన ఆదవ్ రూమ్ కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆదవ్ ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ లో అమర్, దీక్షా(దేవిక సతీష్) లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. ఇద్దరూ కపుల్స్ ఫ్రెండ్స్ అవుతారు.

ఇలా ఇద్దరు కపుల్స్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండగా ప్రార్థన ఆదవ్ కి చెప్పకుండా వేరేవాళ్లను పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతుంది. దీక్ష అమర్ సెల్ఫిష్ నెస్ ని తట్టుకోలేక అతనితో విడిపోతుంది. ఇలా బ్రేకప్ అయిన దీక్ష – ఆదవ్ లు అనుకోకుండా దగ్గరయి పెళ్లి చేసుకుంటారు. అసలు ఆదవ్ – ప్రార్థన ఎందుకు విడిపోయారు? ప్రార్థన ఎందుకు వేరే పెళ్లి చేసుకుంటుంది? ఆదవ్ దీక్ష ఎలా దగ్గరయ్యారు? వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటారు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాల వేళ.. భార్య గురించి మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

సినిమా విశ్లేషణ.. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు ఎమోజీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో మాత్రం అర్ధం కాదు. తమిళ్ లో సిరీస్ గా వచ్చిన ఎమోజీని తెలుగులో సినిమాగా బాగానే ఎడిటింగ్ చేసారు. కథ అంతా ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతుంది. ఆదవ్ – ప్రార్థన లవ్ స్టోరీ ఆర్టిఫీషియల్ గా ఉంటుంది. ఆమెని చాలా మంది ఫాలో చేస్తున్నా సడెన్ గా ఇతను లవ్ అని చెప్పగానే అన్నిటికి ఓకే అంటుంది. ఒక రకంగా లివ్ ఇన్ లో ఉన్నట్టే ఉంటారు. మొదటి గంట వీరి ప్రేమ, రెండు జంటలతో సాగదీస్తారు. ఇంటర్వెల్ సమయానికి ఆదవ్- దీక్ష భార్యాభర్తలు అని ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది.

కానీ ఎందుకు? వాళ్ళు ఎలా కలిశారు? మళ్ళీ విడాకులు ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు అనేది సెకండ్ హాఫ్ బాగానే రాసుకున్నారు. అయితే విడాకులు తీసుకోవాలనే కారణం మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోనే సినిమా అయిపోతుంది. కానీ మళ్ళీ కాస్త సాగదీసి వేరే ఎండింగ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. సినిమా అంతా క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు అయితే చాలానే ఉన్నాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్.. మహత్ ఇంకా బాగా యాక్టింగ్ చేయాలి. ఆల్రెడీ తెలుగులో వరుస సినిమాలతో మెప్పిస్తున్న మానస చౌదరికి ఇది మూడేళ్ళ క్రితం తన కెరీర్ మొదట్లో చేసిన సిరీస్ అని తెలుస్తుంది. ఇందులో క్యూట్ గా కనిపించి మెప్పించింది. దేవిక సతీష్ మాత్రం చాలా బాగా నటించి మెప్పించింది. దేవికా ఆల్రెడీ తెలుగులో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

Also See : Sitara Ghattamaneni : మహేష్ కూతురు.. సితార పాప క్యూట్ ఫోటోలు చూశారా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. చాలా చోట్ల డబ్బింగ్ లిప్ సింక్ మిస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మాత్రం అంతంత మాత్రమే. అయితే ఓ చిన్న వెబ్ సిరీస్ గా సింపుల్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తీసినట్టు అనిపిస్తుంది. కథ రొటీన్ అయినా కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

మొత్తంగా ‘ఎమోజీ’ సినిమా విడివిడిగా ఇద్దరు తమ లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళు కలిసి పెళ్లి చేసుకొని ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటారు అని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చూపించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.