సంపత్ నందితో గోపిచంద్‌ 28

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌‌లో 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా తెరకెక్కనున్న భారీ చిత్రం..

  • Publish Date - September 19, 2019 / 06:12 AM IST

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌‌లో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా తెరకెక్కనున్న భారీ చిత్రం..

మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుంది. ఇంతకు ముందు వీరి కలయికలో ‘గౌతమ్ నంద’ మూవీ వచ్చింది. ఆ సినిమాలో గోపిచంద్ క్లాస్ అండ్ మాస్ పర్ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ గోపిచంద్, సంపత్ నంది కలిసి సినిమా చెయ్యబోతున్నారు.

‘యూ టర్న్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించనున్నారు. హీరోగా గోపిచంద్‌కు 28వ సినిమా ఇది.

తమిళ డైరెక్టర్ తిరుతో గోపిచంద్ చేస్తున్న ‘చాణక్య’ దసరాకు విడుదల కానుంది. బిను సుబ్రమణియన్ అనే మలయాళ దర్శకుడితో గోపిచంద్ చెయ్యబోయే సినిమా ఇటీవలే ప్రారంభంమైంది. గోపిచంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.