టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్‌తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు.
ఆ ఫోటోలోవీరితో పాటు రెండు కుక్కలు ఉన్నాయి. వీటి గురించి మనోజ్ వివరిస్తూ.. ‘ఇక్కడున్న టాంగో – జోయాలు డేటింగ్‌లో ఉన్నాయి. అయినా కూడా తమ వంతు బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తున్నాయి. ఇలాంటి మంచి అల్లుడిని ఇచ్చినందుకు వియ్యకుండు సాయి ధరమ్ తేజ్‌కి థ్యాంక్స్. అంతేకాదు త్వరలోనే టాంగ్ – జోయాలకు ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం’ అని చెప్పుకొచ్చాడు.
సినిమాల విషయానికొస్తే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మనోజ్ తొలిసారి మూడు విభిన్న కోణాలుగల పాత్రల్లో నటిస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
Read:‘నాంది’లో విభిన్నమైన క్యారెక్టర్స్ రివీల్..