Madhavan : మరో సైంటిస్ట్ బయోపిక్‌తో రాబోతున్న మాధవన్‌..

రాకెట్రీ (Rocketry: The Nambi Effect) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మాధవన్ (R Madhavan) మరో సైంటిస్ట్ బయోపిక్ లో నటించబోతున్నాడు.

Madhavan : మరో సైంటిస్ట్ బయోపిక్‌తో రాబోతున్న మాధవన్‌..

Madhavan act in G D Naidu biopic after Rocketry hit

Updated On : April 8, 2023 / 8:00 AM IST

Madhavan : లవ్ స్టోరీ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మాధవన్ (R Madhavan) ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల రాకెట్రీ – నంబి ఎఫెక్ట్‌ (Rocketry: The Nambi Effect) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్‌ (Nambi Narayanan) జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. నంబినారాయణన్‌ పాత్రలో మాధవన్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాడు.

Suriya42 : టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన సూర్య..

గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల పైగా కాలేచ్ట్ చేసింది. ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంతో ఇప్పుడు మరో బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు మాధవన్ సిద్దమవుతున్నాడు. మరో తమిళ ప్రఖ్యాతి శాస్త్రవేత్త జీడీ నాయుడు (Gopalswamy Doraiswamy Naidu) బయోపిక్ లో మాధవన్ నటించబోతున్నాడు. ఈ సైంటిస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ని కనిపెట్టారు. ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

Neeraja Kona : దర్శకురాలిగా మారుతున్న ఎన్టీఆర్, పవన్‌ల కాస్ట్యూమ్ డిజైనర్‌..

ఇక ఈ సినిమాని మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి ఈ బయోపిక్ ని కూడా మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడా? అన్నది తెలియజేయలేదు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ మరియు నటీనటులు, టెక్నీషియన్స్ గురించి వెల్లడించనున్నారు. అలాగే దీనితో పాటు మాధవన్ మరో బయోపిక్ లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రఖ్యాతి లాయర్ సి శంకరన్ నైర్ (C Sankaran Nair) బయోపిక్ లో నటిస్తున్నట్లు సమాచారం.