Test : ‘టెస్ట్’.. క్రికెట్ కథతో తమిళ్ నుంచి మరో భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్..
తమిజా పాదం, లవ్ ఫెయిల్యూర్, గురు, విక్రమ్ వేద, గేమ్ ఓవర్, జగమే తంత్రం.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన Y Not Studios నిర్మాణంలో కొత్త డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో 'టెస్ట్' అనే సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నారు.

Madhavan Nayanathara siddharth combined for a big Pan India Movie Test
Test : ఇటీవల పాన్ ఇండియా(Pan India) సినిమాలు, మల్టీస్టారర్లు(Multi Starer) ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. అన్ని పరిశ్రమలలో కూడా ఇప్పుడు మార్కెట్ పెంచుకోవడానికి భారీ సినిమాలు, మల్టీస్టారర్లు తెరకెక్కిస్తున్నారు. అందరూ పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. తాజాగా మరో సరికొత్త మల్టీస్టారర్, భారీ పాన్ ఇండియా సినిమా తమిళ పరిశ్రమ నుంచి రాబోతుంది.
తమిజా పాదం, లవ్ ఫెయిల్యూర్, గురు, విక్రమ్ వేద, గేమ్ ఓవర్, జగమే తంత్రం.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన Y Not Studios నిర్మాణంలో కొత్త డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో ‘టెస్ట్’ అనే సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నారు. ఇందులో మాధవన్, సిద్దార్థ్, నయనతార ముఖ్య పాత్రలు పోషించనున్నారు. వీరితో పాటు మరింతమంది ప్రముఖ ఆర్టిస్టులు నటించనున్నారు.
Sreeleela : వామ్మో శ్రీలీల చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా..
తాజాగా నేడు టెస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. గతంలో మాధవన్, సిద్దార్థ్ కలిసి నటించిన యువ సినిమా పెద్ద హిట్ అయింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో పాటు లేడీ సూపర్ స్టార్ కూడా చేరడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా.