Madhilo Madhi title poster released by fight masters ram lakshman
Madhilo Madhi : స్వచ్చమైన ప్రేమ కథలకు ఎప్పుడూ జనాధరణ ఉంటుంది. ప్రేమకథలు లేని సినిమా అనేది ఉండదు. ఏ జానర్‌లో సినిమాను తీసినా అందులో ప్రేమ కథ ఉండాల్సిందే. అలాంటిది ఓ స్వచ్చమైన ప్రేమ కథను సినిమాగా మలిచితే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అసలే ఇప్పుడు మాస్ మసాలా కమర్షియల్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో ఓ ప్యూర్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Hanuman : రిలీజ్‌ని వెనక్కి తీసుకు వెళ్తున్న హనుమాన్.. కారణం ఆదిపురుష్?
‘మదిలో మది’ అంటూ ఓ స్వచ్చమైన ప్రేమ కథతో సినిమా రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ విడుదల చేశారు.
RC16 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది!
అనంతరం రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మాట్లాడుతూ.. టైటిల్ చాలా కొత్తగా ఉంది అని మూవీ టీంని అభినందించారు. ఈ సినిమాకు కథ కథనం మాటలు దర్శత్వం అందించిన ప్రకాష్ పల్ల మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వస్తున్న కథలకు భిన్నంగా ఉంటుంది. శ్రీకాకుళం దగ్గర తిలారు అనే గ్రామంలో ఈ సినిమాను తెరకెక్కించాం. లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సరికొత్తగా ఉంటుంది. మదిలో మది మూవీ టీంని ఎంకరేజ్ చేస్తూ డిస్క్వేర్ అకాడమీ ధనరాజ్ మాస్టర్ గారు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కథ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని తొందరలోనే మీ ముందుకు వస్తుంది’ అని అన్నారు.
Madhilo Madhi title poster released by fight masters ram lakshman
Madhilo Madhi title poster released by fight masters ram lakshman