Madhubala
Sai Pallavi : నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా థియేటర్స్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా స్ట్రీమ్ అవుతున్న సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా టాప్3 ప్లేస్ లో ఉంది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో చాలా సాదాసీదాగా నటించి అందర్నీ మెప్పించింది సాయి పల్లవి. ప్రతి సినిమాలోనూ డ్యాన్స్ తో మెప్పించే సాయి పల్లవి ఈ సారి కూడా తన నాట్యంతో శ్యామ్ సింగరాయ్ లో అదరగొట్టేసింది. దీంతో దేశ వ్యాప్తంగా సాయి పల్లవిపై ప్రశంశలు కురిపిస్తున్నారు.
పలువురు సినీ ప్రముఖులు కూడా సాయి పల్లవి నటన గురించి, సినిమా గురించి పొగిడేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నానిని ఇంటికి పిలిచి మరీ సినిమా బాగుందంటూ ప్రశంసించారు. తాజాగా అలనాటి అందాల తార మధుబాల సినిమాపై, సాయి పల్లవిపై ప్రశంశల వర్షం కురిపించారు.
Sai Pallavi : సాయి పల్లవిపై ట్రోల్స్.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
సీనియర్ నటి మధుబాల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూసి ఈ సినిమాపై ట్విట్టర్లో ఓ వీడియో క్లిప్ ని షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్ లో ”శ్యామ్ సింగరాయ్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సాయిపల్లవి సహజ నటన, అందం, అంతకుమించిన డ్యాన్స్ అన్నీ బాగున్నాయి. నేను ఆమెకు పెద్ద అభిమానిని. నాని ఫెంటాస్టిక్‌గా నటించాడు” అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. దీనికి సాయిపల్లవి స్పందిస్తూ.. ”మీ ప్రశంసలతో నేను ఒక అందమైన హగ్ ని అందుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ధన్యవాదాలు మేడమ్. మీ మాటలకి నేను చాలా సంతోషిస్తున్నాను. లవ్ యు మేడం” అని రిప్లై ట్వీట్ చేసింది.
I feel like I received a warm hug, I’m so overwhelmed?? Thank you so much for the kind words, ma’am ♥️ lots of love to you ♥️?? https://t.co/fjK1joF7P9
— Sai Pallavi (@Sai_Pallavi92) January 29, 2022