×
Ad

Akhanda 2 : బాలయ్య బాబుకు షాక్.. ‘అఖండ 2’ విడుదల ఆపేసిన హైకోర్టు.. మహేష్ సినిమా ఎఫెక్ట్..?

సినిమా రిలీజ్ కి ముందు అఖండ 2 కి పెద్ద షాక్ తగిలింది. (Akhanda 2)

Akhanda 2

Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమా రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇది బాలయ్య బాబుకు మొదటి పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, అవధి.. భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు అఖండ 2 కి పెద్ద షాక్ తగిలింది. (Akhanda 2)

తాజాగా మద్రాస్ హైకోర్టు అఖండ 2 సినిమా విడుదల ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ అఖండ 2 విడుదల నిపిలివేయాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తమకు 28 కోట్ల నష్టాలను చెల్లించాల్సి ఉందని, ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమాలు చేస్తున్నారని, ఆ డబ్బులు చెల్లించేంతవరకు అఖండ 2 సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగా అఖండ 2 విడుదల ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Raju Weds Rambai : సూపర్ హిట్ సినిమా.. రాజు వెడ్స్ రాంబాయిని మిస్ చేసుకున్న నలుగురు హీరోలు ఎవరో తెలుసా..?

ఈరోస్ సంస్థ చెప్పే 28 కోట్ల నష్టాలు మహేష్ బాబు వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలకు సంబంధించినవి అని తెలుస్తుంది. ఆ రెండుకి సినిమాలని 14 రీల్స్ సంస్థే నిర్మించింది. అయితే ఇది కేవలం తమిళనాడుకు మాత్రమేనా లేదా దేశమంతా విడుదల ఆపాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బాలయ్య బాబు సినిమాకు రిలీజ్ ముందు ఇలా అవ్వడంతో ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. మరి దీనిపై అఖండ 2 నిర్మాణసంస్థ ఏమైనా స్పందిస్తుందా చూడాలి.