Maguva O Maguva : అత్త ప్రేమ కూడా కోడలికి ఇబ్బంది కలిగిస్తే.. స్టార్ మాలో రాబోతున్న సరికొత్త సీరియల్..

అత్త ప్రేమ కూడా కోడలికి ఇబ్బంది కలిగిస్తుంటే.. ఆ కథ ఎలా ఉందబోతుంది..? స్టార్ మాలో రాబోతున్న సరికొత్త సీరియల్ 'మగువ ఓ మగువ'.

Maguva O Maguva new telugu serial will be telecast in star maa

Maguva O Maguva : తెలుగు సినిమాల్లో మార్పు వచ్చినట్లు, సీరియల్స్ లో కూడా మార్పులు వస్తున్నాయి. తెలుగు ఇంట కనిపించే ఎమోషన్స్ ని చూపిస్తూనే.. ఇప్పటి జనరేషన్ కి తగ్గ స్క్రీన్ ప్లేతో సీరియల్ డైరెక్టర్స్ వీక్షకుల ముందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే బుల్లితెర వ్యూయర్స్ ముందుకు రాబోతున్న సరికొత్త సీరియల్ ‘మగువ ఓ మగువ’. ఈ సీరియల్ తల్లీ కొడుకుల ప్రేమ బంధంతో రూపొందుతుంది.

అయితే ఈ అనుబంధాన్ని అన్ని సీరియల్స్‌లు మాదిరి కాకుండా ఓ కొత్త కోణంలో ఆడియన్స్ కి చూపించబోతున్నారు. కొడుకు ఇష్టపడిన ప్రతి విషయాన్ని ఇష్టపడే తల్లి.. ఆ కొడుకు ఇష్టపడిన వస్తువులను అపురూపంగా దాచుకొని వాటిలో కొడుకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంది. అలాంటి తల్లి కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడి, ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకు వచ్చినప్పుడు.. ఆ కోడలిని కూడా కొడుకు ఇష్టపడిన వస్తువుగానే చూస్తూ, ఆ వస్తువు పై అమితమైన ప్రేమ చూపిస్తుంటుంది.

Also read : Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?

అత్త చూపించే ఆ అమితమైన ప్రేమ కోడలికి ఎలా ఇబ్బందికరంగా మారింది..? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి. అత్తిల్లు అంటే కోడలకి ఒక కొత్త ప్రపంచం కావాలి గానీ అది బందిఖానా లేదా పంజరంలానో మారితే ఆమె పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకి సమాధానమే ఈ ధారావాహిక అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సీరియల్ లో కొన్ని ట్విస్ట్ లు కూడా ఉన్నాయట.

అంతా సంతోషంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో జరగరాని ఓ సంఘటన జరగడంతో అటు అత్తని, ఇటు కోడలిని కలవరపెట్టింది. ఆ తరవాత ఎదురయ్యే పర్యవసానాలను అత్త, కోడలు ఎలా ఎదుర్కొన్నారో అనేది మనసుని తట్టేలా చెప్పుకొచ్చారట. కాగా ఈ సరికొత్త సీరియల్ ని ఫిబ్రవరి 19 నుంచి మధ్యాహ్నం 1గం.కు స్టార్ మా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.