Savitri : మహానటి సావిత్రి బర్త్ డే స్పెషల్.. చిన్న సంతకంతో జెమినీ గణేశన్‌తో పెళ్లి బయటపడిందట..

సావిత్రి, జెమినీ గణేశన్‌ రహస్య పెళ్లి ఎలా బయటపడింది..? మహానటి బర్త్ డే స్పెషల్ లో తెలుసుకోండి.

Mahanati Savitri Birthday special story about her marriage

Savitri : మహానటి సావిత్రి గురించి తెలుగు వారికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లె మండలం చిర్రావూరులో 1934 డిసెంబర్ 6న మహానటి జన్మించారు. నేటితో ఆమె జన్మించి 89 వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి గురించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీకోసం.

సావిత్రి తమిళ హీరో జెమినీ గణేశన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గణేశన్ కి అప్పటికే వివాహం అయ్యిపోయింది. ఆయన సావిత్రిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి సమయానికి సావిత్రి వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే అని చెబుతారు. ఇక ఈ పెళ్లి కూడా ఎవరికి తెలియకుండా సావిత్రి, గణేశన్ మాత్రమే చేసుకున్నారు. ఆ తరువాత ఈ పెళ్లి విషయం బయటకి వచ్చి సంచలనం అయ్యింది.

అయితే ఈ పెళ్లి విషయం అసలు ఎలా బయట పడింది అనే సంగతి చాలా మందికి తెలియదు. మహానటి సినిమాలో సావిత్రి, గణేశన్ ప్రేమలేఖలు బయట పడడంతో పెళ్లి విషయం అందరికి తెలిసినట్లు చూపించారు. అయితే ఆ పెళ్లి విషయం బయట పడడానికి ఇండస్ట్రీలో మరో కారణం కూడా వినిపిస్తుంటుంది. సావిత్రమ్మ చేసిన ఒక చిన్న సంతకంతో పెళ్లి విషయం బయటపడిందని చెబుతుంటారు.

Also read : Animal Movie : యానిమల్ మూవీ ఆ హీరోయిన్ చేయాల్సింది.. కానీ రష్మిక ఎంట్రీ..

గణేశన్ తో పెళ్లి సమయానికి సావిత్రి స్టార్‌డమ్ కి చేరుకున్నారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఆమె పేరు ఇటు తెలుగులో, అటు తమిళంలో మారుమోగుతోంది. దీంతో ఒక ఇంటర్నేషనల్ సబ్బు కంపెనీ సావిత్రిని తమ బ్రాండ్ అంబాసడర్ గా చూపించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం సావిత్రితో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారట. ఇలా అగ్రిమెంట్ చేయించుకునే క్రమంలోనే పెళ్లి మ్యాటర్ బయటపడిందట.

సావిత్రి ఆ సుబ్బు కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా అగ్రిమెంట్ లో సైన్ చేసేటప్పుడు.. ‘సావిత్రి గణేశన్’ అని సైన్ చేశారట. అలా కంగారులో తమ పెళ్లి విషయాన్ని సావిత్రి బయట పెట్టేశారని చెబుతుంటారు. కాగా సావిత్రి, గణేశన్ లకు ఇద్దరు పిల్లలు. మొదటిగా విజయ చాముండేశ్వరి కూతురు పుట్టింది. ఆ తరువాత సతీష్ కుమార్ అనే కుమారుడు జన్మించారు. ఇక సావిత్రం 47 ఏళ్ళ వయసులో 19 నెలలు కోమాలో ఉండి మరణించారు.